HomeMovie NewsKanguva 30 Crore Loss in Overseas ఓవర్సీస్ లో 'కంగువ' కు రూ. 30...

Kanguva 30 Crore Loss in Overseas ఓవర్సీస్ లో ‘కంగువ’ కు రూ. 30 కోట్ల లాస్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ క్రియేషన్, యువి క్రియేషన్స్ సంస్థలపై గ్రాండ్ గా నిర్మితమైన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఇటీవల భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో దిశ పటాని హీరోయిన్ గా నటించారు.

ఇక కంగువ అటు తమిళ్ తో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో కూడా భారీ నష్టాలు చవిచూసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడవ్వగా ఇది ఓవరాల్ గా రూ. 24 కోట్ల గ్రాస్ ని అనగా కేవలం రూ. 10 కోట్ల షేర్ ని మాత్రమే ఆర్జించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్సీస్ లో ఈ మూవీ 30 కోట్ల లాస్ ను మూటగట్టుకుంది. అలానే ఇతర ప్రాంతాల్లో కూడా కంగువ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా చాలావరకు లాస్ అయ్యారు.

See also  Kanguva Telugu High chances for 100 crore club 'కంగువ' : తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా ?

కంగువ మూవీ ఓవరాల్ గా క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ రూ. 105 కోట్లని మాత్రమే అందుకుంది. నిజానికి ఈ మూవీ భారీ హిట్ అవుతుందని అలానే ఓవరాల్ గా 1000 కోట్ల మార్కు చేరుకుంటుందని అందరూ భావించారు, నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేసారు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 400 కోట్ల బ్రేకీవెన్ అందుకోవాల్సిన ఈ సినిమా కేవలం 25% మాత్రమే రికవరీతో భారీ డిజాస్టర్ గా నిలిచి అందరికీ భారీ షాక్ ఇచ్చింది.

Follow on Google News Follow on Whatsapp

See also  Ram 22nd Movie Heroine Fixed రామ్ 22వ మూవీలో యంగ్ బ్యూటీ ఫిక్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories